ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు

రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు.

Updated : 29 Mar 2024 09:35 IST

ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచిన వైనం

శిరివెళ్ల, న్యూస్‌టుడే: రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. గురువారం యర్రగుంట్లలో ఏకంగా సీఎం జగన్‌తో ముఖాముఖిలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యేను ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన మాట్లాడుతూ భూమా అఖిలప్రియ అధికారంలో ఉన్నా స్వగ్రామానికి బీటీ రోడ్డు వేయించుకోలేకపోయారని, గంగుల బ్రిజేంద్రరెడ్డి రాగానే బీటీ రోడ్డు వేయించారని పొగడ్తలతో ముంచెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని