బస్సులు సీఎం సభకు.. కష్టాలు ప్రయాణికులకు

ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి సభకు తరలించడంతో కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రయాణికులు అష్టకష్టాలు ఎదుర్కొన్నారు.

Published : 29 Mar 2024 04:25 IST

నంద్యాల(రైతునగరం), న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి సభకు తరలించడంతో కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రయాణికులు అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో బుధవారం, నంద్యాల జిల్లా కేంద్రంలో గురువారం వైకాపా ‘మేమంతా సిద్ధం’ సభలు నిర్వహించారు. వీటికి జనాన్ని తరలించేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని డిపోల నుంచి సుమారు 500 బస్సులను మంగళవారమే మళ్లించారు. అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కర్నూలు-1, 2, నంద్యాల డిపోల్లో 100కుపైగా, మంత్రాలయం, శ్రీశైలం, ఆత్మకూరు, నందికొట్కూరు, బనగానపల్లి, కోవెలకుంట్ల డిపోల నుంచి 50 శాతానికి పైగా బస్సులను అటు మళ్లించారు. ఇది తెలియని ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకని బస్టాండ్లకు వచ్చి నానా అవస్థలు పడ్డారు. మండుటెండల్లో ఉక్కపోతను భరిస్తూ గంటల తరబడి నిరీక్షించినా బస్సులు రాలేదని వాపోయారు. కొందరు ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు వెళ్లాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని