పఫర్‌ ఫిష్‌

విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి.

Updated : 29 Mar 2024 06:40 IST

విశాఖపట్నం (సాగర్‌నగర్‌), న్యూస్‌టుడే: విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. ఈ జీవులను ‘పఫర్‌ ఫిష్‌’ అని పిలుస్తారని, స్థానిక జాలర్లు సముద్ర కప్పలని అంటారని మత్స్యశాఖ సహాయ సంచాలకుడు డాక్టర్‌ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సాగర జలాల్లో చాలా లోపల సంచరించే ఈ జీవులు వలలో చిక్కుకున్నప్పుడు, దాడికి గురైన సమయంలో.. తమను తాము రక్షించుకునేందుకు ఇలా బెలూన్ల తరహాలోకి మారుతుంటాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని