జగన్‌.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్‌.. తన సొంత ఇలాకా వైయస్‌ఆర్‌ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు.

Updated : 29 Mar 2024 09:50 IST

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్‌.. తన సొంత ఇలాకా వైయస్‌ఆర్‌ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందులలో అపాచీ లెదర్‌ పరిశ్రమ స్థాపనతో పది వేల మందికి ఉపాధి కల్పిస్తామంటూ ప్రకటించగా, అయిదేళ్లలో కేవలం ప్రహరీ నిర్మాణానికే పరిమితమైంది.

కొప్పర్తిలో అతిపెద్ద పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తున్నామంటూ గొప్పలు చెబుతూ వచ్చారు. అక్కడ కేవలం డిక్సన్‌ పరిశ్రమ పరిమిత సామర్థ్యంతో ఇటీవలే ఏర్పాటైంది. ఎన్నో పరిశ్రమల స్థాపనకు భూములు తీసుకున్నా అవేవీ సాకారం కాలేదు. కడపకు ఉక్కు పరిశ్రమ తెస్తానంటూ వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే శిలాఫలకం వేశారు. ఆ తర్వాత ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకున్నామంటూ.. దాని ఆధ్వర్యంలో నిర్మాణ పనులకు భూమిపూజ సైతం చేశారు. కాలం గడిచినా, ఒక్క ఇటుక కూడా పేర్చలేదు.    

 ఈనాడు, కడప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని