కన్నారా.. ఇది విన్నారా?

ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది.

Published : 29 Mar 2024 06:23 IST

వైకాపా ఎల్‌ఈడీ వాహనాల్లో కలెక్టర్‌ ప్రసంగం ప్రదర్శన
కాకినాడ గ్రామీణ వైకాపా అభ్యర్థి కన్నబాబు నిర్వాకం

ఈనాడు, కాకినాడ: ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు అధికారిక కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్‌ కృతికాశుక్లా గతంలో పాల్గొన్నారు. ప్రభుత్వం వేల మందికి పట్టాలిచ్చిందని చెబుతూ.. పథకాలను ప్రజలకు వివరించారు. రికార్డు చేసిన ఆ వీడియో ప్రసంగాన్ని ఎన్నికల ప్రచార రథంలో ప్రస్తుతం కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో ప్రదర్శిసున్నారు. సాక్షాత్తూ జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగం సాగుతుండగానే, వైకాపాకు ఓటేయాలని కోరుతూ.. ఫ్యాను గుర్తు, సీఎం జగన్‌, వైకాపా అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులు కన్నబాబు, చలమలశెట్టి సునీల్‌ చిత్రాలతో ప్రదర్శిస్తుండడంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కరప మండలం నడకుదురు గ్రామంలో ఈ అతిక్రమణ దృశాలు కనిపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని