ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది

రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి.

Updated : 29 Mar 2024 07:36 IST

రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల స్థాయికి
నేడు, రేపు మరింత పెరిగే అవకాశం

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.6 నుంచి 2.9 డిగ్రీల వరకు పెరిగాయి. ముఖ్యంగా రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లోనూ వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రాయలసీమ జిల్లాల్లో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం ఏర్పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

  • గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాలలో 42.0, కర్నూలు 41.9, కడప 41.2, అనంతపురం 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
  • వైయస్‌ఆర్‌ జిల్లాలో 13, నంద్యాల జిల్లాలో 9, కర్నూలు 2, పార్వతీపురం మన్యం 2, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం జిల్లాల్లోని ఒక్కో మండలంలో వడగాలులు వీచాయి.
  • శుక్రవారం వైయస్‌ఆర్‌ జిల్లాలోని 18 మండలాలతో పాటు నంద్యాల, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు