వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ

 ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్‌ ఓ ప్రకటనలో విమర్శించారు.

Published : 29 Mar 2024 05:15 IST

సన్మానం పేరుతో ఉద్యోగులతో సమావేశాలకు యత్నాలు
ఆంధ్ర పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్‌ విమర్శ

ఈనాడు, అమరావతి:  ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్‌ ఓ ప్రకటనలో విమర్శించారు. ‘‘వైకాపాకు కొమ్ము కాస్తూ ‘చలో విజయవాడ’ ఉద్యమాన్ని నీరుగార్చి, వ్యతిరేక ఫలితాలు రావడానికి ఆయన కారకుడయ్యారు. ప్రభుత్వ సలహాదారు హోదాలో ఉన్న చంద్రశేఖరరెడ్డి నిత్యం ఏపీ ఎన్జీఓ హోమ్‌కు వచ్చి కూర్చోవడం, సంఘ కార్యకలాపాల్లో కలగజేసుకోవడం తీవ్ర అభ్యంతరకరం. నూతనంగా ఎన్నికైన ఎన్జీఓ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి, పుషోత్తమ నాయుడులకు సన్మానం పేరుతో వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించడానికి చంద్రశేఖరరెడ్డి ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. తమకు రావాల్సిన బకాయిల సొమ్ము చేతికి అందకుండానే ఎందరో పెన్షనర్లు చనిపోయారు. ఈ పాపం జగన్‌కు తప్పనిసరిగా తగులుతుంది. నిరసన తెలిపే హక్కును వైకాపా ప్రభుత్వం కాల రాసింది’’ అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని