సీఎస్‌, డీజీపీలను బదిలీ చేయండి

‘‘ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు.

Published : 29 Mar 2024 05:16 IST

ఛేంజ్‌ డాట్‌ ఓఆర్‌జీలో ఈసీకి పిటిషన్‌

ఈనాడు, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. వారిని వెంటనే బదిలీ చేయాలి’’ అని కోరుతూ రాష్ట్రానికి చెందిన పలువురు ‘ఛేంజ్‌ డాట్‌ ఓఆర్‌జీ’ వెబ్‌సైట్‌ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పిటిషన్‌ పెట్టారు. మూడురోజుల కిందట ఈ పిటిషన్‌ మొదలుపెట్టగా.. గురువారం సాయంత్రం వరకూ ఈ డిమాండుకు 1,651 మంది మద్దతు పలికారు. ‘‘సీనియర్‌ అధికారులందర్నీ పక్కనపెట్టి మరీ సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలను జగన్‌ ప్రభుత్వం ఆ హోదాల్లో నియమించింది. వీరిద్దరూ వైకాపా సానుభూతిపరులు. సీఎం జగన్‌ది, ఈ అధికారులది ఒకే సామాజికవర్గం, ఒకే జిల్లా. తమను నియమించినందుకు ప్రతిఫలంగా వీరిద్దరూ వైకాపాకు అనుకూలంగా, ప్రతిపక్ష పార్టీలకు నష్టం కలిగించేలా బహిరంగంగానే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు. ప్రజాస్వామిక హక్కులను దెబ్బతీయడమే కాకుండా.. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు క్రమబద్ధమైన ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోండి’’ అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని