రాష్ట్రంలోనే తొలిసారి బ్రెయిలీ లిపిలో ఫిర్యాదు

రాష్ట్రంలోనే తొలిసారిగా బ్రెయిలీ లిపిలో ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన విశాఖ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Published : 30 Mar 2024 04:07 IST

విశాఖపట్నం (మద్దిలపాలెం), న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే తొలిసారిగా బ్రెయిలీ లిపిలో ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన విశాఖ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆ వివరాలిలా.. విశాఖపట్నం బిర్లా జంక్షన్‌, బొత్స స్క్వేర్‌ వద్ద ఉన్న ఓ కంపెనీ వారు అధిక లాభాల పేరిట అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం జల్లూరుకు చెందిన ఓ అంధుడి నుంచి రూ.2.90 లక్షలు, కాకినాడకు చెందిన అతని స్నేహితుడి వద్ద నుంచి రూ.11 లక్షలను వసూలు చేసి ఆ మొత్తాన్ని కాజేశారు. దీంతో ఇటీవల అంధుడు దిశ దివ్యాంగ సురక్ష (డీడీఎస్‌) ద్వారా ఫిర్యాదు చేశారు. బ్రెయిలీ లిపిలో ఉన్న ఫిర్యాదును నగర పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ స్వీకరించారు. వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని