ఏపీ సీఎంఓ వాట్సప్‌ గ్రూప్‌ పేరు మారింది

ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వాట్సప్‌ గ్రూప్‌ పేరు మారింది. శుక్రవారం దీన్ని వైఎస్‌ జగన్‌ ఏపీ మీడియాగా మార్చారు.

Published : 30 Mar 2024 04:35 IST

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వాట్సప్‌ గ్రూప్‌ పేరు మారింది. శుక్రవారం దీన్ని వైఎస్‌ జగన్‌ ఏపీ మీడియాగా మార్చారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న ప్రజా సంబంధాల అధికారులు (పీఆర్‌ఓలు).. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా నిబంధనలను తుంగలో తొక్కుతూ సీఎంఓ గ్రూప్‌లో జగన్‌ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వార్తలు, ఫొటోలు పెడుతున్న వైనంపై ‘సీఎం పీఆర్‌ఓలా.. వైకాపా నాయకులా?’ శీర్షికన గురువారం కథనం వచ్చింది. దీంతో శుక్రవారం గ్రూప్‌ పేరు మార్చారు. అయితే పీఆర్‌ఓలైన శ్రీహరి, చంద్రకాంత్‌, ఈశ్వర్‌ నంబర్లతోనే మధ్యాహ్నం 3 గంటల వరకూ సీఎం జగన్‌ పర్యటన వార్తలు, ఫొటోలను పోస్టు చేశారు. తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ మీడియా పేరుతో పోస్టులు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు