జాలిరెడ్డిపై ఎందుకంత ప్రేమ?

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని బిగినపల్లిలో విధులు నిర్వహిస్తున్న కేశవరపు జాలిరెడ్డి అనే ఉపాధ్యాయుడు వైకాపాకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

Published : 30 Mar 2024 04:40 IST

వైకాపాకు ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు శూన్యం
ఈయన కళాశాలలోనే అధికార పార్టీకి చెందిన అభ్యర్థి డబ్బులు రూ.5 కోట్లు మాయం

ఈనాడు, అమరావతి: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని బిగినపల్లిలో విధులు నిర్వహిస్తున్న కేశవరపు జాలిరెడ్డి అనే ఉపాధ్యాయుడు వైకాపాకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఈయనకు ప్రైవేటు పాఠశాలలతోపాటు జూనియర్‌, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిని నిర్వహిస్తున్న ట్రస్టుకు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అటు కొండెపి, ఇటు కందుకూరు వైకాపా అభ్యర్థులకు బహిరంగంగా ప్రచారం చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌, సర్వీసులు చూసే జేడీ రామలింగానికి.. జాలిరెడ్డి ప్రచారం చేస్తున్న ఫొటోలతో సహా ఫిర్యాదు చేసినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. గతంలో ఆయన పాఠశాలకు వెళ్లకుండా ఓ వాలంటీర్‌ను పెట్టి నిర్వహించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. మండల అధికారులను మచ్చిక చేసుకుని ఇష్టారాజ్యంగా రాజకీయాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఓ పురపాలక ఉపాధ్యాయుడు హైకోర్టు కేసుకు సంబంధించి వాట్సప్‌లో తప్పుడు సమాచారం పెట్టారంటూ ఏకంగా ఆయన్ని సస్పెండ్‌ చేశారు. కానీ, జాలిరెడ్డిపై మాత్రం చర్యలు తీసుకోవడంలేదు. ఈయనకు సంబంధించిన కళాశాలలో అధికార పార్టీకి చెందిన ఓ అభ్యర్థి డబ్బులు రూ.5కోట్లు మాయమైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో పంచేందుకు తెచ్చినవి కావడంతో పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. పాఠశాలల తనిఖీలకు వెళ్లిన సమయంలో నోటు పుస్తకాలు దిద్దలేదని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సైతం ఈయన విషయంలో మౌనం వహిస్తున్నారు? దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని