ప్రజాగళం సభకు వెళ్లారని కుళాయి కనెక్షన్‌ తీసేశారు!

ప్రజాగళం సభకు వెళ్లారన్న కక్షతో ఓ ఇంటికి కుళాయి కనెక్షన్‌ను వైకాపా నేతలు తొలగించారు. పల్నాడు జిల్లా నూజండ్ల మండలం తెల్లబాడు రజకకాలనీకి చెందిన పగడాల రాముడు, సుశీల ఈ నెల 17న చిలకలూరిపేటలో బొప్పూడి వద్ద నిర్వహించిన ప్రజాగళం సభకు తెదేపా వారితో కలిసి వెళ్లారు.

Published : 30 Mar 2024 07:01 IST

నూజండ్ల, న్యూస్‌టుడే: ప్రజాగళం సభకు వెళ్లారన్న కక్షతో ఓ ఇంటికి కుళాయి కనెక్షన్‌ను వైకాపా నేతలు తొలగించారు. పల్నాడు జిల్లా నూజండ్ల మండలం తెల్లబాడు రజకకాలనీకి చెందిన పగడాల రాముడు, సుశీల ఈ నెల 17న చిలకలూరిపేటలో బొప్పూడి వద్ద నిర్వహించిన ప్రజాగళం సభకు తెదేపా వారితో కలిసి వెళ్లారు. మమ్మల్ని కాదని ఆ సభకు వెళ్తారా అని కక్ష పెంచుకున్న స్థానిక వైకాపా నాయకులు.. వారం కిందట వారి ఇంటికున్న పంచాయతీ కుళాయి కనెక్షన్‌ను తొలగించారు. దాంతో వేసవిలో తాగు నీటి కోసం నానా యాతన పడాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని