కడప డీసీసీబీ సీఈఓ రాజేంద్రకుమార్‌ సస్పెన్షన్‌

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఉమ్మడి కడప జిల్లా సహకార కేంద్రబ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) రాజేంద్రకుమార్‌పై వేటు పడింది.

Published : 30 Mar 2024 04:36 IST

సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పోస్టులే కారణం

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఉమ్మడి కడప జిల్లా సహకార కేంద్రబ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) రాజేంద్రకుమార్‌పై వేటు పడింది. తెలంగాణకు సంబంధించిన రాజకీయ ప్రస్తావనలతో ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసినట్లు సమాచారం. దీనిని జిల్లాకు చెందిన కొందరు నాయకులు.. సహకారశాఖ ఉన్నతాధికారులకు, జిల్లా ఎన్నికల అధికారికి, బ్యాంకు పాలకవర్గానికి ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు జిల్లా అధికారులతో మాట్లాడారు. సీఈఓపై చర్యలు తీసుకోవాలని పాలకవర్గానికి జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు సూచించారు. దీంతో రాజేంద్రకుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ ఝాన్సీరాణి ఆదేశాలు జారీచేశారు. ఇప్పటి వరకు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఉపాధి సిబ్బందిపైనే చర్యలు తీసుకున్నారు. తొలిసారిగా జిల్లాస్థాయి అధికారిపై వేటు పడడంతో యంత్రాంగం ఉలిక్కిపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని