గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. వడగాలులు

వాతావరణ మార్పుల కారణంగా మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. శుక్రవారం రాయలసీమ, ఉత్తర కోస్తాలోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి.

Published : 30 Mar 2024 04:36 IST

నేడు, రేపు అసౌకర్య వాతావరణం

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: వాతావరణ మార్పుల కారణంగా మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. శుక్రవారం రాయలసీమ, ఉత్తర కోస్తాలోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. వైయస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరులో తీవ్ర వడగాలి వీచింది. అనంతపురం, కర్నూలు, తిరుపతి, కావలి, తుని, నంద్యాల తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగాయి. రాబోయే రెండురోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఏర్పడవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం శుక్రవారం పేర్కొంది. రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశముందని తెలిపింది. శనివారం రాష్ట్రంలోని 50 మండలాల్లో, ఆదివారం 56 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతుందని పేర్కొంది. శుక్రవారం అత్యధికంగా ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సొసైటీ (ఏపీఎస్‌డీపీఎస్‌) వెబ్‌సైట్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని