ఏపీ సీఎం బస్సుపైకి చెప్పు

గుత్తిలో సీఎం జగన్‌ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద బస్సు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 31 Mar 2024 06:17 IST

గుత్తి, న్యూస్‌టుడే : గుత్తిలో సీఎం జగన్‌ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద బస్సు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హఠాత్తుగా పైనుంచి చెప్పు పడటంతో పోలీసులు, సీఎం అంగరక్షకులు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలో బస్సుపై సీఎం జగన్‌తోపాటు గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌  నైరుతిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్‌కుమార్‌ ఉన్నా ఎవరిపైనా చెప్పు పడలేదు. అయితే దీనిపై పోలీసులు, వైకాపా నాయకులు గానీ స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని