ఏప్రిల్‌ 9న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 9న శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఆ రోజు ఉదయం 3 గంటలకు సుప్రభాతం, అనంతరం శుద్ధి నిర్వహిస్తారు.

Updated : 31 Mar 2024 06:21 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 9న శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఆ రోజు ఉదయం 3 గంటలకు సుప్రభాతం, అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి, విష్వక్సేనులవారికి విశేష సమర్పణ, 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపు చేపట్టి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు ధరింపజేస్తారు. అనంతరం పంచాంగ పఠనం ఉంటుంది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. ఈ పర్వదినం పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని