రాష్ట్రంలో పెరగనున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

Published : 31 Mar 2024 04:03 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముందని తెలిపింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో వడగాలులు వీయనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ కేంద్రం ప్రకటించింది. ‘సోమవారం ఒక మండలంలో తీవ్ర, మరో 64 మండలాల్లో సాధారణ స్థాయిలో వడగాలులు వీయనున్నాయి. శనివారం విజయనగరం, అనకాపల్లి, నంద్యాల, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో తీవ్ర వడగాలులు, మరో 52 మండలాల్లో ఓ మాదిరి వడగాలులు వీచాయి’ అని వివరించింది. శనివారం అత్యధికంగా నంద్యాల జిల్లా అవుకులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని