అనాథలకు చదువుల చుక్కాని

తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి నిరాదరణకు గురవుతున్న చిన్నారులకు ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందించేందుకు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 60 ఎకరాల సువిశాల ప్రాంగణంలో హీల్‌ ప్యారడైజ్‌ పాఠశాలను ఏర్పాటుచేశారు.

Updated : 31 Mar 2024 06:33 IST

తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు 
హీల్‌ ప్యారడైజ్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఆఖరు తేదీ ఏప్రిల్‌ 15

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి నిరాదరణకు గురవుతున్న చిన్నారులకు ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందించేందుకు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 60 ఎకరాల సువిశాల ప్రాంగణంలో హీల్‌ ప్యారడైజ్‌ పాఠశాలను ఏర్పాటుచేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఆంగ్ల మాధ్యమంలో సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికతో కార్పొరేటు పాఠశాలకు దీటుగా ఇక్కడ బోధిస్తున్నారు. ఇది కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి 12 కి.మీ. దూరంలో ఉంది. 

2024-25 ప్రవేశాలకు రేపటినుంచి దరఖాస్తులు

తల్లిదండ్రులు లేకపోయినా, వారిలో ఎవరో ఒకరు లేకపోయినా విద్యాసంస్థలో ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తారు. వారు పదో తరగతి వరకు ఇక్కడే చదువుకునే అవకాశం ఉంటుంది. 11వ తరగతి (ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం)లో ప్రవేశానికి ప్రతిభ పరీక్షలు విద్యాలయంలోనే ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. నిరుపేద విద్యార్థులకే ఈ అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్‌ పూర్తయి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రవేశ పరీక్షలు విద్యాలయంలో నిర్వహించి అర్హులకు యాప్‌ డెవలప్‌మెంట్‌, కంటెంట్‌ డిజైన్‌, సైబర్‌ సెక్యూరిటీ కోర్సులను నేర్పుతారు. వీటన్నింటి కోసం సోమవారంనుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

15 వేల పుస్తకాలతో గ్రంథాలయం

పాఠశాలలో 15వేల పుస్తకాలతో గ్రంథాలయం అందుబాటులో ఉంది. విద్యార్థుల ఆసక్తి మేరకు కళల్లో ప్రోత్సహిస్తున్నారు. త్రీడీ చిత్రలేఖనం, క్రాఫ్ట్‌, సంగీతం, నృత్యం తదితర అంశాల్లో శిక్షణనిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 400 మీటర్ల ట్రాక్‌, బాస్కెట్‌బాల్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌ కోర్టులూ ఉన్నాయి. బాలబాలికలకు వేర్వేరుగా ఆధునిక హంగులతో వసతి గృహాలు ఉన్నాయి.  ఇక్కడ చదువుకున్న విద్యార్థుల ఉన్నత విద్యకు హీల్‌ సంస్థే సహకరిస్తుంది. విద్యార్థుల కోసం పాఠశాల ప్రాంగణంలోనే ఆసుపత్రినీ ఏర్పాటుచేశారు.


తల్లిదండ్రులను కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే

‘నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారులకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాం. హీల్‌ ద్వారా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే మా ధ్యేయం. దేశంలో ఏ ప్రాంతంవారైనా ఇక్కడ చేరొచ్చు’ అని హీల్‌ సంస్థ నిర్వాహకుడు డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్‌, కార్యదర్శి తాతినేని లక్ష్మి, సీఈవో కె.అజయ్‌కుమార్‌ తెలిపారు.


అర్హత ఇలా..

తల్లిదండ్రులు లేని విద్యార్థులకే హీల్‌ ప్యారడైజ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం:
ఏప్రిల్‌ 1 నుంచి..
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 15
వెబ్‌సైట్‌: ‌www.healschool.co.in
సంప్రదించాల్సిన ఫోన్‌నంబర్లు:   9100024438, 9100024435

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు