ఈసీ ఆదేశాలను వెంటనే అమలు చేయాలి

న్నికల విధులకు, లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రయోజనాల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే అమలు చేయాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ డిమాండు చేశారు.

Published : 31 Mar 2024 04:19 IST

సీఎఫ్‌డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల విధులకు, లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రయోజనాల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే అమలు చేయాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ డిమాండు చేశారు. ‘‘గతంలోనూ ఈసీ ఈ తరహా ఆదేశాలు ఇచ్చినా.. సీఎం జగన్‌, మంత్రి ధర్మాన ప్రసాదరావు వాటిని బేఖాతరు చేస్తూ వాలంటీర్లను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వాలంటీర్లు.. ఓటింగ్‌ ప్రొఫైల్‌ చేసి, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడం గోప్యతహక్కు ఉల్లంఘించడమే. అలాగే వైకాపాకి ఓటు వేయాలని ప్రజలను బెదిరిస్తున్నారు. ఇది ఎన్నికల కోడ్‌ను బేఖాతరు చేయడమే’’ అని ఆయన పేర్కొన్నారు. వైకాపాకు ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు పనిచేస్తున్న ఘటనలపై తమ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. పథకాల లబ్ధిదారులకు నగదు పంపిణీకి వారికి బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఇచ్చిన ఆదేశాలను సీఎఫ్‌డీ స్వాగతిస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని