చట్టాలపై స్థూల పరిజ్ఞానం అవసరం

న్యాయాధికారులకు చట్టాలపై స్థూల పరిజ్ఞానం అవసరమని హైకోర్టు న్యాయమూర్తి, పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ పేర్కొన్నారు.

Published : 31 Mar 2024 05:19 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: న్యాయాధికారులకు చట్టాలపై స్థూల పరిజ్ఞానం అవసరమని హైకోర్టు న్యాయమూర్తి, పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తమకుమార్‌ అధ్యక్షతన న్యాయాధికారులకు కార్యశాల నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్‌ కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. న్యాయాధికారులకు చట్టాలపై విధానపరమైన పరిజ్ఞానం ఉండాలని, అందుకు కార్యశాలలు నిర్వహిస్తున్నామన్నారు. న్యాయమూర్తులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇవి దోహదపడతాయని వెల్లడించారు. రిసోర్సు పర్సన్లుగా సీనియర్‌ న్యాయవాదులు వైవీ రవిప్రసాద్‌, ఎం.సూరిబాబు, విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.సాల్మన్‌రాజు పాల్గొని మారుతున్న చట్టాల తీరుతెన్నులను వివరించారు. అనంతరం జస్టిస్‌ కృష్ణమోహన్‌ ఉమ్మడి జిల్లాలోని న్యాయాధికారులతో కేసుల పురోగతిపై సమీక్షించారు. ముందుగా జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి జి.రామగోపాల్‌, ఏలూరు బార్‌ అసోసియేషన్‌ సభ్యుడు ఎ.విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని