సచివాలయాల వద్దనే పింఛన్ల పంపిణీ

ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు పింఛనుదారులకు సామాజిక భద్రత పింఛన్లను సచివాలయాల వద్ద పంపిణీ చేయనున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) సీఈఓ మురళీధర్‌రెడ్డి ఆదివారం సర్క్యులర్‌ జారీచేశారు.

Published : 01 Apr 2024 05:24 IST

సర్క్యులర్‌ జారీ చేసిన సెర్ప్‌ సీఈఓ మురళీధర్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు పింఛనుదారులకు సామాజిక భద్రత పింఛన్లను సచివాలయాల వద్ద పంపిణీ చేయనున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) సీఈఓ మురళీధర్‌రెడ్డి ఆదివారం సర్క్యులర్‌ జారీచేశారు. లబ్ధిదారుల ఆధార్‌ అథెంటికేషన్‌ (బయోమెట్రిక్‌/ఐరిస్‌/ఆధార్‌ ఫేస్‌) ద్వారా సచివాలయ ఉద్యోగులు వారికి పింఛను మొత్తాన్ని అందిస్తారని తెలిపారు. ఇవి విఫలమైతే రియల్‌ టైం బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్‌ సిస్టం (ఆర్‌బీఐఎస్‌) ద్వారా అందిస్తారని పేర్కొన్నారు. ఏ సచివాలయం పరిధిలో ఎంతమంది లబ్ధిదారులున్నారు? వారికి పంపిణీ చేయాల్సిన మొత్తం ఎంతనే వివరాలతో కూడిన అథెంటికేషన్‌ లెటర్‌ను పంచాయతీ కార్యదర్శులు, సంక్షేమ, విద్యాసహాయకులు, వార్డు అడ్మిన్‌ కార్యదర్శులు, సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులకు ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు అందిస్తారు. వీటిని ఎన్నికల అధికారులకు కూడా నివేదిస్తారు. సచివాలయ ఉద్యోగులు ఈ ధ్రువీకరణ పత్రాలను తీసుకెళ్లి బ్యాంకుల నుంచి నగదు తీసుకోవాలి. పంపిణీ బాధ్యతను సంక్షేమ, విద్యాసహాయకులు, వార్డు అడ్మిన్‌ కార్యదర్శి పర్యవేక్షిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని