పలాసలో పాత్రికేయులకు నగదు పంపిణీ!

ఎన్నికల వేళ వైకాపా నేతలు తాయిలాలతో ఎర వేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఆదివారం పాత్రికేయులకు ఇళ్ల పట్టాలు, రూ.10 వేలు చొప్పున నగదు పంపిణీ చేశారు.

Published : 01 Apr 2024 04:40 IST

మంత్రి అప్పలరాజు నేతృత్వంలో ఇళ్ల పట్టా, రూ.10 వేల చొప్పున అందజేత

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం: ఎన్నికల వేళ వైకాపా నేతలు తాయిలాలతో ఎర వేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఆదివారం పాత్రికేయులకు ఇళ్ల పట్టాలు, రూ.10 వేలు చొప్పున నగదు పంపిణీ చేశారు. ఈ విషయమై మంత్రి సీదిరి అప్పలరాజు మార్చి 29న స్థానిక పాత్రికేయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికల్లో తనకు సహకారం అందించాలని కోరుతూ భోజనాలు సైతం ఏర్పాటు చేశారు. ఆదివారం ఆయన తన అనుచరులను కొంత మంది పాత్రికేయుల ఇళ్లకు పంపించారు. వారి ద్వారా డిసెంబరు నెల తేదీతో ఉన్న ఇళ్ల పట్టాతో పాటు రూ.10 వేల నగదును అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని