తిరుమలలో రేపు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను తితిదే రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని  విజ్ఞప్తి చేసింది.

Updated : 01 Apr 2024 06:13 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను తితిదే రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని  విజ్ఞప్తి చేసింది.

శ్రీవాణి టికెట్లకు విశేష స్పందన:  ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గత నెల 16 నుంచి సిఫార్సు లేఖల స్వీకరణను తితిదే రద్దు చేసింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆఫ్‌లైన్‌ విధానంలో జారీచేసే శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను పెంచింది. 15 రోజుల వ్యవధిలో 22,752 శ్రీవాణి దర్శన టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు. వీటిద్వారా తితిదేకు రూ.22.75 కోట్ల ఆదాయం సమకూరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని