సాయానికి సర్కారు ‘మీన’మేషాలు

యువతకి ఉపాధి, డోర్‌ డెలివరీ పేరుతో ఏడాది కిందట మంగళగిరి పరిధిలోని ఆత్మకూరు వద్ద అట్టహాసంగా ప్రారంభించిన ఫిష్‌ ఆంధ్ర ప్రాజెక్టు కథ కంచికి చేరుతోంది.

Published : 01 Apr 2024 04:44 IST

ఈనాడు, అమరావతి: యువతకి ఉపాధి, డోర్‌ డెలివరీ పేరుతో ఏడాది కిందట మంగళగిరి పరిధిలోని ఆత్మకూరు వద్ద అట్టహాసంగా ప్రారంభించిన ఫిష్‌ ఆంధ్ర ప్రాజెక్టు కథ కంచికి చేరుతోంది. రహదారిని ఆనుకుని నిర్మించిన 17 రిటైల్‌ ఔట్‌లెట్లలో రోజూ మూడు మాత్రమే తెరుస్తున్నారు. మిగిలిన రోజుల్లో ఎక్కువ శాతం మూసి ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇందులోని ఐదు ఔట్‌లెట్‌లు మాత్రం ఎప్పటికీ తీయరని, అవి బినామీల పేరుతో స్థానిక వైకాపా నాయకులే తీసుకోవడం కారణమని వారు పేర్కొంటున్నారు. రూ.558 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 14వేల ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేస్తామని తొలుత ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. వాటిల్లో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన వెయ్యికి పైగా కేంద్రాల్లో 90 శాతం మూతపడుతుండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఫిష్‌ హబ్‌ల ద్వారా ప్రభుత్వం తక్కువ ధరలకు చేపలను సరఫరా చేస్తామని ప్రకటించడంతో కొందరు నాయకులు డబ్బులు ఇచ్చి మరీ వీటిని తీసుకున్నారు. ప్రభుత్వం చేతులెత్తేయడంతో దూరప్రాంతాల నుంచి చేపలను కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మాలంటే వ్యయ ప్రయాసలు పెరుగుతున్నాయని ఔట్‌లెట్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ అమ్మడానికే నష్టాలు వస్తుంటే డోర్‌ డెలివరీ ఏం చేస్తామని వాపోతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని