అచ్చెన్నాయుడికి మాతృవియోగం

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి మాతృమూర్తి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడి నాన్నమ్మ కింజరాపు కళావతమ్మ (90) ఆదివారం కన్నుమూశారు.

Published : 01 Apr 2024 04:45 IST

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి మాతృమూర్తి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడి నాన్నమ్మ కింజరాపు కళావతమ్మ (90) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కళావతమ్మకు దివంగత తెదేపా నేత ఎర్రన్నాయుడు, హరివరప్రసాద్‌, ప్రభాకరరావు, అచ్చెన్నాయుడు (నలుగురు కుమారులు), డోర లక్ష్మి, మెండ ఆదిలక్ష్మి, అంబటి అమ్మాజమ్మ (ముగ్గురు కుమార్తెలు) సంతానం. సోమవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మాడలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.


కళావతమ్మ కన్నుమూత బాధాకరం

చంద్రబాబు, పవన్‌ సంతాపం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అచ్చెన్నాయుడి తల్లి కళావతమ్మ మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు ఆదివారం ఓ ప్రకటనలో వేర్వేరుగా సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని