సమ్మెటివ్‌-2 పరీక్షలు 6 నుంచి

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6 నుంచి సమ్మెటివ్‌-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అవి 19తో ముగియనున్నాయి.

Published : 01 Apr 2024 04:49 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6 నుంచి సమ్మెటివ్‌-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అవి 19తో ముగియనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1-9 తరగతులు, ప్రైవేటులో 6-9 తరగతులకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి ప్రశ్నపత్రాలను అందిస్తుంది. 1-8 తరగతుల వారికి తరగతి ఆధారిత మదింపు(సీబీఏ-3) నిర్వహిస్తారు. సీబీఏ పరీక్షకు ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు ప్రశ్నపత్రంతో పాటు ఓఎంఆర్‌ షీట్‌ను అందిస్తారు. 1-5 తరగతులకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకటే ఓఎంఆర్‌ షీటు ఉంటుంది. 6,7,8 తరగతులకు లాంగ్వేజ్‌ పరీక్షలకు ఒకటి, భాషేతర సబ్జెక్టు మరో ఓఎంఆర్‌ షీట్‌ ఇస్తారు. ప్రైవేటు యాజమాన్యంలోని విద్యార్థులకు ప్రశ్నపత్రమే ఇస్తారు. సీబీఎస్‌ఈ పాఠశాలల్లోని 8,9 తరగతుల వారికి 12న టోఫెల్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. పరీక్షల అనంతరం 22న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి, విద్యార్థుల పురోగతిని వివరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని