మన్యంలోనూ మండుతున్న ఎండలు

రాష్ట్రంలోనే అతిశీతల ప్రాంతంగా పేరొందిన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఎండలు మండుతున్నాయి. మూడు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Published : 01 Apr 2024 04:49 IST

చింతపల్లిలో 36.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు

చింతపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే అతిశీతల ప్రాంతంగా పేరొందిన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఎండలు మండుతున్నాయి. మూడు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో ఆదివారం అత్యధికంగా 36.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వాతావరణ విభాగం నోడల్‌ అధికారి ఎం.సురేష్‌కుమార్‌ తెలిపారు. శుక్ర, శనివారాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో వారపు సంతలు, రహదారుల పక్కన కూరగాయలు అమ్ముతున్నవారు గొడుగునీడన, పరదాల మాటున తలదాచుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని