వైకాపా సర్కారు మొద్దునిద్రకు ఇదే సాక్ష్యం!

మండు వేసవిలోనూ నిండుకుండలా ఉండే జలాశయాల్లో కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయం ఒకటి. కానీ ఇది ఒకప్పటి మాట.

Updated : 01 Apr 2024 06:12 IST

న్యూస్‌టుడే, మేదరమెట్ల: మండు వేసవిలోనూ నిండుకుండలా ఉండే జలాశయాల్లో కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయం ఒకటి. కానీ ఇది ఒకప్పటి మాట. వైకాపా ప్రభుత్వ మొద్దునిద్రకు అధికారుల నిర్లక్ష్యం తోడవడంతో రిజర్వాయర్‌ రెండు గేట్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటన జరిగి ఏడాదిన్నర దాటింది. కొత్తవి పెట్టించి, మిగిలిన గేట్లకు మరమ్మతులు చేయించాల్సిన సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా జలాశయంలో ఉన్న నీరంతా సముద్రం పాలైంది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం తమ్మవరం వద్ద గుండ్లకమ్మ జలాశయంలోని చాలాప్రాంతం ప్రస్తుతం నీటి నిల్వలు లేక పచ్చిక బయళ్లతో కనిపిస్తోంది. దీంతో స్థానికులు అందులో పశువులను మేపుతున్నారు. జలాశయం కుడి, ఎడమ కాల్వల ద్వారా రబీ, ఖరీఫ్‌లలో 1.40 లక్షల ఎకరాలకు సాగు నీరు, ఒంగోలు పట్టణానికి తాగు నీరు అందిస్తారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రిజర్వాయర్‌ గేట్లకు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని