ఇంటిస్థలం కొండల మధ్య ఇస్తారా?

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే కళావతికి అడుగడుగునా నిరసన సెగ తగిలింది. నియోజకవర్గంలోని వెలగవాడలో ఆదివారం ఆమె పర్యటించారు.

Published : 01 Apr 2024 09:11 IST

పాలకొండ ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్థులు

పాలకొండ, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే కళావతికి అడుగడుగునా నిరసన సెగ తగిలింది. నియోజకవర్గంలోని వెలగవాడలో ఆదివారం ఆమె పర్యటించారు. పలువురు మహిళలు ఆమెను చుట్టిముట్టి సమస్యలపై నిలదీశారు. జగనన్న కాలనీలో కొందరికి గ్రామంలో ఇళ్ల స్థలాలను ఇవ్వగా.. తమకు మాత్రం కొండల మధ్యలో ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఎక్కడో ఒకచోట ఇచ్చాం కదా అంటూ ఎమ్మెల్యే వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు నిరసన తెలపకుండా ఓవైపు ప్రచారరథ శబ్దం, మరోవైపు కార్యకర్తలు నినాదాలు చేశారు. జాబితాలో తమ పేరు వచ్చినా.. స్థానిక నాయకులు రాజకీయం చేసి తొలగించారంటూ కొందరు మహిళలు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. తనకు వాలంటీరు పోస్టు ఇస్తామని కొందరు నాయకులు డబ్బులు తీసుకున్నారంటూ.. సింగన్నవలస ఎస్సీ కాలనీలో ఓ యువతి ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అంపిలిలో మహిళలు తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని