వాలంటీర్ల నుంచి ప్రభుత్వ సామగ్రి స్వాధీనం

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గ్రామ, వార్డు వాలంటీర్ల నుంచి సెల్‌ఫోన్లు, సిమ్‌ కార్డులు, బయోమెట్రిక్‌ ఐరిస్‌లు, కుటుంబ సమాచార పుస్తకాలను సచివాలయ ఉద్యోగులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.

Published : 01 Apr 2024 05:03 IST

గంపలగూడెం, ఎ.కొండూరు, న్యూస్‌టుడే: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గ్రామ, వార్డు వాలంటీర్ల నుంచి సెల్‌ఫోన్లు, సిమ్‌ కార్డులు, బయోమెట్రిక్‌ ఐరిస్‌లు, కుటుంబ సమాచార పుస్తకాలను సచివాలయ ఉద్యోగులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. నియోజకవర్గంలోని 67 గ్రామ సచివాలయాల పరిధిలో 1400 మంది వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో.. వారు విధులకు వినియోగిస్తున్న ప్రభుత్వ సామగ్రిని స్వాధీనం చేసుకోవాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ సందర్భంగా గంపలగూడెం, తిరువూరు మండలాల ఎంపీడీవో పీవీఎస్‌ నాగేశ్వరరావు మాట్లాడుతూ..ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన సామగ్రిని సీజ్‌ చేసి నియోజకవర్గ ఆర్వో వద్ద భద్రపరిచామన్నారు. కుటుంబ సమాచారం నమోదుచేసిన దస్త్రాలను గ్రామ సచివాలయాల్లోనే ఉంచనుండగా.. ఐరిస్‌, డివైస్‌లు ఎంపీడీవో కార్యాలయంలో అప్పగించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని