ఏపీ పోలీసు సేవ యాప్‌లో ఇంకా జగన్‌ బొమ్మే

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి పదిహేను రోజులు దాటిపోయినా.. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఇంకా జగన్‌, వైకాపా సేవలోనే తరిస్తున్నారు. ఆయన భజనే కొనసాగిస్తున్నారు.

Updated : 01 Apr 2024 09:22 IST

అధికార పార్టీ రంగులతో దిశ యాప్‌ లోగో
కోడ్‌ వచ్చి 15 రోజులైనా తొలగించని అధికారులు

ఈనాడు, అమరావతి: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి పదిహేను రోజులు దాటిపోయినా.. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఇంకా జగన్‌, వైకాపా సేవలోనే తరిస్తున్నారు. ఆయన భజనే కొనసాగిస్తున్నారు. నియమావళి మాకో లెక్కా అన్నట్లుగా బేఖాతరుగా ఉంటున్నారు. ‘ఏపీ పోలీసు సేవా యాప్‌’లో ఇప్పటికీ సీఎం జగన్‌ ఫొటో తొలగించలేదు. ఈ యాప్‌ ఓపెన్‌ చేయగానే కొంతసేపు జగన్‌ బొమ్మే కనిపిస్తోంది. ఈ యాప్‌ లోగో రంగులు కూడా వైకాపా జెండా రంగుల్ని పోలి ఉన్నాయి. ‘దిశ యాప్‌’ లోగో కూడా వైకాపా జెండా రంగులతోనే ఉంది. వీటినీ ఇప్పటివరకూ తొలగించలేదు. ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలుచేయాల్సిన పోలీసులే దాన్ని ఉల్లంఘిస్తున్నారు. గత అయిదేళ్లుగా ప్రతిపక్ష నేతలు, ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు, తీవ్ర నిర్బంధాలు, అణిచివేత అమలు చేస్తూ వైకాపా సేవలో తరిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా ఇంకా అధికారపార్టీ నాయకుల పట్ల మితిమీరిన స్వామిభక్తి ప్రదర్శిస్తూ వారికి సాగిలపడుతూనే ఉన్నారు. అధికారిక యాప్‌లలో జగన్‌ బొమ్మ, వైకాపా జెండా రంగులతో కూడిన లోగోలు ఉండటం నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు