కోడ్‌ ఉన్నా.. మేం ప్రారంభించేస్తాం

న్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. అవేం మాకు పట్టవని అధికార పార్టీ అభ్యర్థులు ప్రారంభోత్సవాలు చేసేస్తున్నారు.

Published : 01 Apr 2024 05:12 IST

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. అవేం మాకు పట్టవని అధికార పార్టీ అభ్యర్థులు ప్రారంభోత్సవాలు చేసేస్తున్నారు. విశాఖ నగరంలోని 19వ వార్డు పెదజాలారిపేటలో 2012లోనే జీవీఎంసీ కల్యాణ మండపాన్ని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీన్ని అప్పటి మేయర్‌ పులుసు జనార్దనరావు, తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆ సమయంలోనే ప్రారంభించారు. అయితే తాజాగా ఎన్నికల్లో లబ్ధిపొందడానికి విశాఖ తూర్పు వైకాపా అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అదే కల్యాణ మండపానికి తన సొంత నిధులతో ఏసీ సమకూర్చి, రంగులు వేయించారు. కోడ్‌ ఉన్నప్పటికీ ఆదివారం దానికి రిబ్బన్‌ కట్‌ చేసి తిరిగి ప్రారంభించారు. దీనిపై తెదేపా నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని