పింఛన్ల పంపిణీపై అసత్య ప్రచారం.. వాలంటీరు తొలగింపు

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందునా వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించొద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ అంశంపై కొందరు వాలంటీర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Published : 02 Apr 2024 02:55 IST

దాచేపల్లి(గురజాల గ్రామీణ), న్యూస్‌టుడే: ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందునా వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించొద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ అంశంపై కొందరు వాలంటీర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టి వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలంటూ వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడుకు చెందిన వాలంటీరు షేక్‌ సిలార్‌బాషా ఇలాగే పోస్టు పెట్టడంతో అతణ్ని విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో వెంకటరమణ తెలిపారు.

ఉద్దేశపూర్వకంగానే పింఛన్ల పంపిణీలో జాప్యం: షర్మిల

ఈనాడు, అమరావతి: పింఛన్ల పంపిణీలో అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి వైకాపాకు మేలు కలిగేలా వ్యవహరిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఒక రోజులో పింఛన్లు పంపిణీ చేయడానికి.. పది రోజులు ఎందుకని సోమవారం ఒక ప్రకటనలో షర్మిల ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని