‘వివేకం’ సినిమా ప్రదర్శన నిలిపివేయండి.. హైకోర్టులో దస్తగిరి పిటిషన్‌

యూట్యూబ్‌, ఓటీటీలలో వివేకం సినిమా ప్రదర్శనను నిలిపివేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ.. వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

Updated : 02 Apr 2024 06:28 IST

ఈనాడు, అమరావతి: యూట్యూబ్‌, ఓటీటీలలో వివేకం సినిమా ప్రదర్శనను నిలిపివేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ.. వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. తాను సీబీఐకి, పులివెందుల కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ సినిమా తీశారని.. ఇందులో తన పేరును అపకీర్తి పాల్జేసేలా పేర్కొన్నారన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు చిత్ర ప్రదర్శనను నిలిపేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరపనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని