నంద్యాల జిల్లా పాణ్యంలో 43.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

రాష్ట్రంలో భానుడి ప్రతాపం పెరుగుతోంది. నెల్లూరు, కావలి, తుని, అనంతపురం, కర్నూలు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, ఆరోగ్యవరం(అన్నమయ్య జిల్లా) తదితర ప్రాంతాల్లో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.

Published : 02 Apr 2024 02:57 IST

రానున్న రోజుల్లో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం
ప్రజలకు వాతావరణ కేంద్రం హెచ్చరిక

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రంలో భానుడి ప్రతాపం పెరుగుతోంది. నెల్లూరు, కావలి, తుని, అనంతపురం, కర్నూలు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, ఆరోగ్యవరం(అన్నమయ్య జిల్లా) తదితర ప్రాంతాల్లో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా పాణ్యంలో 43.7, కర్నూలు జిల్లా నందికొట్కూరు, గ్రామీణ మండలాల్లో 43.3, తిరుపతిజిల్లా గూడూరులో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం అనకాపల్లి, విజయనగరం, నంద్యాల జిల్లాల్లోని ఒక్కో మండలంలో తీవ్రంగా వడగాలులు వీచాయి. మంగళ, బుధవారాల్లో పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని