ఎన్నికల కోడ్‌ ఉన్నా విద్యాకానుకపై ప్రచారం

పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ వైకాపాపై స్వామి భక్తి ప్రదర్శించడంలో ఎక్కడా తగ్గడం లేదు. తనిఖీలు, సమావేశాల నిర్వహణతో ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నించిన ఆయన.. ఇప్పుడు విద్యాకానుక ప్రచారాన్ని మొదలుపెట్టారు.

Published : 02 Apr 2024 03:00 IST

వైకాపాకు స్వామిభక్తి ప్రదర్శించడంలో తగ్గేదేలే అంటున్న ప్రవీణ్‌ప్రకాశ్‌

ఈనాడు, అమరావతి: పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ వైకాపాపై స్వామి భక్తి ప్రదర్శించడంలో ఎక్కడా తగ్గడం లేదు. తనిఖీలు, సమావేశాల నిర్వహణతో ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నించిన ఆయన.. ఇప్పుడు విద్యాకానుక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎన్నికల కోడ్‌ ఉన్నా.. విద్యా కానుక వస్తువులు సరఫరా ప్రారంభం కాకపోయినా నిల్వ చేసేందుకు గోదాముగిడ్డంగులను తీసుకోవాలంటూ క్షేత్రస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. విద్యాకానుక వస్తువుల సరఫరా ప్రారంభమయ్యేలా చూడాలని సమగ్ర శిక్షా అభియాన్‌ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల పాఠ్యపుస్తకాల ముద్రణ వద్దకు వెళ్లి, అక్కడ వాటిని పరిశీలిస్తున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు. జూన్‌ నాటికి పాఠ్యపుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పాఠశాలలు జూన్‌ 12న పునఃప్రారంభమవుతాయి. దీనికి ఇంకా రెండు నెలలకుపైగా సమయం ఉంది. ఇప్పటి నుంచే వస్తువుల సరఫరా మొదలు పెట్టి, పోలింగ్‌ నాటికి జిల్లాలు, మండలాలకు సామగ్రిని చేరవేసేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నా ఏదో ఒక  పేరుతో ప్రభుత్వ కార్యక్రమాలను ఓటర్లకు చెప్పేలా ప్రణాళికలు వేస్తున్నారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలతోపాటు ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు నిర్వహించాలంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ ఏడాది ముందుగానే ప్రవేశాల ప్రక్రియ మొదలుపెట్టడం వైకాపా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని