వైకాపా పాలనలో విదేశీ విద్య దూరం

వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విదేశీ విద్యను దూరం చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు వద్ద బాధిత విద్యార్థుల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 02 Apr 2024 03:13 IST

చంద్రబాబు వద్ద బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన

బాపట్ల, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విదేశీ విద్యను దూరం చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు వద్ద బాధిత విద్యార్థుల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్లలో ఆదివారం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు రాత్రికి ఇంజినీరింగ్‌ కళాశాల అతిథిగృహం వద్ద బస చేశారు. సోమవారం ఉదయం ఆయనను పలువురు కలిసి వినతిపత్రాలు అందించారు. వైకాపా ప్రభుత్వం చేసిన అన్యాయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 359 మంది విదేశీ విద్య ఆర్థిక సాయం అందక నష్టపోయారని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు వివరించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం కింద వేల మంది పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించారని వారు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బాధిత విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.

ఒప్పంద ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలి: విద్యుత్తు శాఖలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబుకు విద్యుత్తు ఒప్పంద ఉద్యోగులు, కార్మికుల సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు. తెదేపా కూటమి అధికారంలోకి రాగానే ఒప్పంద ఉద్యోగులు, కార్మికులకు న్యాయం చేస్తామని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని