తిరుమల ఘాట్‌రోడ్డులో తప్పిన ప్రమాదం

తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో సోమవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న భక్తులు పెనుప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.

Updated : 02 Apr 2024 06:32 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో సోమవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న భక్తులు పెనుప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ బస్సు వెళుతుండగా హరిణి సమీపంలో అకస్మాత్తుగా అదుపు తప్పింది. పక్కనే ఉన్న రక్షణ గోడను, చెట్టును ఢీకొని లోయలోకి పడకుండా ఆగిపోయింది. భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. రోడ్డుపై ఇంజిన్‌ ఆయిల్‌ ఉండటంతోనే బస్సు అదుపు తప్పినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని