ఆర్టీసీ ప్రాంగణాల్లో ఎన్నికల ప్రచారం చేయనివ్వద్దు

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందునా ఆర్టీసీ ప్రాంగణాల్లో ఎన్నికల ప్రచారాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్లకు వివిధ జిల్లాల ప్రజా రవాణాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

Published : 02 Apr 2024 05:16 IST

డిపో మేనేజర్లకు జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారుల ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందునా ఆర్టీసీ ప్రాంగణాల్లో ఎన్నికల ప్రచారాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్లకు వివిధ జిల్లాల ప్రజా రవాణాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆర్టీసీలోని ఓ ఉద్యోగుల సంఘం సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కలిసి ఓ పార్టీకి అనుకూలంగా ప్రచారాలు చేశారని, ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఇటువంటివి జరగకుండా చూడాలంటూ చిత్తూరు జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల కిందట ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఛైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి, పీటీడీ వైయస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య, తదితరులు.. చిత్తూరు జిల్లాలోని వివిధ డిపోలకు వెళ్లి వైకాపాకు ఓటేయాలని కోరారు. దీంతో ఆ జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని