తాగు అవసరాలకు సాగర్‌ నీళ్లివ్వండి

ఎండాకాలంలో తాగునీటి అవసరాలు పెరిగినందున నాగార్జునసాగర్‌ కుడి కాలువకు ఇది వరకే కేటాయించిన కోటా ప్రకారం ఏప్రిల్‌ 8 నుంచి నీళ్లు విడుదల చేయాలని రాష్ట్ర జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి కృష్ణాబోర్డు ఛైర్మన్‌కు సోమవారం లేఖ రాశారు.

Updated : 02 Apr 2024 05:18 IST

తెలంగాణ కేటాయింపులకు మించి వాడింది
కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ లేఖ

ఈనాడు, అమరావతి: ఎండాకాలంలో తాగునీటి అవసరాలు పెరిగినందున నాగార్జునసాగర్‌ కుడి కాలువకు ఇది వరకే కేటాయించిన కోటా ప్రకారం ఏప్రిల్‌ 8 నుంచి నీళ్లు విడుదల చేయాలని రాష్ట్ర జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి కృష్ణాబోర్డు ఛైర్మన్‌కు సోమవారం లేఖ రాశారు. రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున నీళ్లు విడుదల చేయాలని, ఇందుకు అనుగుణంగా కృష్ణా బోర్డు సిబ్బందికి, సాగర్‌ రక్షణ బాధ్యతలు చూస్తున్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి తగిన ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు. ‘2023 అక్టోబరులో త్రిసభ్య కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏప్రిల్‌ 8 నుంచి సాగర్‌ కుడి కాలువకు 11 రోజుల పాటు 5,500 క్యూసెక్కుల చొప్పున మొత్తం 5 టీఎంసీలు ఇవ్వాలి. నాటి సమావేశం తర్వాత శ్రీశైలం నుంచి ఏపీ 26.98 టీఎంసీలు, తెలంగాణ 17.60 టీఎంసీలు సాగర్‌ నుంచి ఏపీ 15.477 టీఎంసీలు, తెలంగాణ 24.791 టీఎంసీలు వాడుకున్నాయి. ఏపీ 45 టీఎంసీలు వినియోగించుకోవడానికి ఆమోదం ఉండగా ఇంత వరకు 42.457 టీఎంసీలే తీసుకుంది. అదే సమయంలో తెలంగాణ తన కోటా నీళ్ల కన్నా 7.391 టీఎంసీలు అదనంగా ఉపయోగించుకుంది’ అని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ తన లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని