త్వరలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలు

గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలు శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated : 02 Apr 2024 09:43 IST

ఈనాడు-అమరావతి: గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలు శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నోటిఫికేషన్‌ జారీకి, ప్రిలిమ్స్‌ మధ్య ఉన్న తక్కువ సమయం సన్నద్ధతకు సరిపోకపోవడం, ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం, ‘భారత సమాజం’ చాప్టర్‌కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా రావడం వంటి కారణాలతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) రాసేందుకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీ కార్యాలయానికి అభ్యర్థనలు వస్తున్నాయి. దీనిపై కమిషన్‌ చురుగ్గా పరిశీలన చేస్తోంది. ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదలనాటికి దీనిపై అధికారిక నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. మరోవైపు...ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ద్వారా కూడా ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రశ్నపత్రంలో ఆంగ్లం నుంచి తెలుగు అనువాదంలో తప్పులు దొర్లడం, సన్నద్ధతకు తగిన సమయం లేకపోవడం వంటి కారణాల దృష్ట్యా ప్రధాన పరీక్షను ఎక్కువ మంది రాసేందుకు అవకాశాన్ని కల్పించాలని అభ్యర్థిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని