‘కదలరా తెలుగోడా కదలిరా’ పేరుతో పాటల ఆల్బమ్‌

Published : 02 Apr 2024 05:22 IST

ఆవిష్కరించిన తెదేపా నాయకులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘కదలరా తెలుగోడా కదలిరా’ అంటూ ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్‌ అట్లూరి నారాయణరావు ఆధ్వర్యంలో రాసిన పాటల ఆల్బమ్‌ను తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్‌, వర్ల రామయ్య, నక్కా అనంద్‌బాబు, మాచర్ల తెదేపా ఎమ్యెల్యే అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఆవిష్కరించారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడా లేని అరాచక పాలనను రాష్ట్రంలో చూస్తున్నాం. సంఘవిద్రోహశక్తి అధికారంలో ఉంటే ప్రజలు ఎలా ఇబ్బందులకు గురవుతారో చూస్తున్నాం. అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఒత్తిళ్లు, దమనకాండను తట్టుకొని నిలబడుతున్న పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేలా ఈ పాటలు ఉన్నాయి’ అని వారు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని