జస్టిస్‌ శేషసాయిని కలిసిన బీబీఏ నూతన కార్యవర్గం

బెజవాడ బార్‌ అసోసియేషన్‌(బీబీఏ) నూతన కార్యవర్గ సభ్యులు.. కృష్ణా జిల్లా పోర్ట్‌ ఫోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయిని హైకోర్టులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 03 Apr 2024 05:08 IST

ఈనాడు, అమరావతి: బెజవాడ బార్‌ అసోసియేషన్‌(బీబీఏ) నూతన కార్యవర్గ సభ్యులు.. కృష్ణా జిల్లా పోర్ట్‌ ఫోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయిని హైకోర్టులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. జస్టిస్‌ శేషసాయి నూతనంగా ఎంపికైన కార్యవర్గాన్ని అభినందించారు. సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. న్యాయమూర్తిని కలిసిన వారిలో బీబీఏ అధ్యక్షుడు కొత్త చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి అరిగల శివరామ ప్రసాద్‌(రాజా), ఉపాధ్యక్షుడు జి.వెంకటరామశర్మ, సంయుక్త కార్యదర్శి క్రాంతికుమార్‌, లైబ్రేరియన్‌ చావల రవికుమార్‌, కోశాధికారి వివి సుబ్రహ్మణ్యం, క్రీడల కార్యదర్శి షేక్‌ అజ్గర్‌, మహిళా కార్యదర్శి ఎస్‌ రాజ్యలక్ష్మి ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని