పాఠశాలల్లో వాటర్‌ బెల్‌: కమిషనర్‌

పాఠశాలల్లో ‘వాటర్‌ బెల్‌’ కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

Published : 03 Apr 2024 05:08 IST

ఈనాడు, అమరావతి: పాఠశాలల్లో ‘వాటర్‌ బెల్‌’ కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. రోజుకు మూడు సార్లు వాటర్‌ బెల్‌ కొట్టాలని సూచించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ‘‘రాష్ట్రంలో పలు చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలి. రోజూ ఉదయం 8.45, 10.05, 11.50 గంటలకు కచ్చితంగా బెల్‌ మోగించాలి. ఆ సమయంలో విద్యార్థులు తప్పకుండా నీరు తాగేలా చూడాలి’’ అని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని