జగన్‌ వస్తున్నారంటే గొడ్డలికి పనిజెప్పాల్సిందే!

సీఎం హెలికాప్టర్‌లో వెళ్తున్నారని రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఎక్కడివక్కడ ఆపేస్తాడు.. ఓ కానిస్టేబుల్‌. ఇది ఓ సినిమాలో కాబట్టి.. చూసి ఆ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని చూసి నవ్వుకున్నాం.

Published : 03 Apr 2024 05:11 IST

సీఎం హెలికాప్టర్‌లో వెళ్తున్నారని రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఎక్కడివక్కడ ఆపేస్తాడు.. ఓ కానిస్టేబుల్‌. ఇది ఓ సినిమాలో కాబట్టి.. చూసి ఆ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని చూసి నవ్వుకున్నాం. రాష్ట్రంలోని అధికారులూ అంతకు మించి ప్రవర్తిస్తుండటంతో నవ్వాలోఏడ్వాలో తెలియక ప్రజలు అసహనంతో రగిలిపోతున్నారు. ‘సీఎం వస్తున్నారు’ అని తెలిస్తే చాలు.. అధికారులు ఆ మార్గంలో చెట్లు కొట్టేసి, పుట్టలు తవ్వేసి, కాల్వలు పూడ్చేస్తున్నారు.

సీఎం హెలికాప్టర్‌లో వచ్చినా.. బస్సులో వచ్చినా.. ఎలా వచ్చినా సరే అధికారులు ముందుచేసే పనే ఇది. మంగళవారం సీఎం జగన్‌ బస్సు యాత్ర వైయస్సార్‌ జిల్లా మదనపల్లె నుంచి చౌడేపల్లె, సోమల, సదుం మీదుగా చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. సదుంలో ఆయన వచ్చే మార్గంలో భారీ వృక్షాలపై గొడ్డలి వేటు పడింది. చుట్టూ కొమ్మలు నరికి గుండు కొట్టేశారు. సదుం-కల్లూరు ప్రధాన రహదారిలో  తాతల నాటి చింత చెట్టు కొమ్మలు పూర్తిగా తొలగించారు. సదుం-సోమల రహదారిలో జాండ్రపేట వద్ద చెట్ల కొమ్మలు తొలగించారు.

 సదుం, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని