భానుడి సెగ.. భగభగ

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. బుధవారం వివిధ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. ఉదయం 7 గంటల నుంచే వేడి వాతావరణం నెలకొంటోంది.

Updated : 04 Apr 2024 05:34 IST

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. బుధవారం వివిధ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. ఉదయం 7 గంటల నుంచే వేడి వాతావరణం నెలకొంటోంది. దీంతో వృద్ధులు, పిల్లలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. వడగాలుల తీవ్రత కూడా మరింత పెరగనుంది. రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా వైయస్‌ఆర్‌ జిల్లాలోని కడప, ఒంటిమిట్ట, సిద్ధవటం ప్రాంతాల్లో 43.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43.3 డిగ్రీల చొప్పున, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైయస్‌ఆర్‌ జిల్లా వీరపునాయునిపల్లి మండలంలో తీవ్ర వడగాలులు, మరో 59 మండలాల్లో వడగాలులు వీచాయి. గురువారం రాష్ట్రంలో 130 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని