సత్యసాయి ఆంగ్ల అనువాదకుడు అనిల్‌కుమార్‌ కన్నుమూత

సత్యసాయిబాబా ప్రసంగాలను ఆంగ్లంలో అనువాదం చేసిన ఆచార్యులు కామరాజు అనిల్‌కుమార్‌(81) అనారోగ్యంతో కన్నుమూశారు.

Published : 04 Apr 2024 04:14 IST

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయిబాబా ప్రసంగాలను ఆంగ్లంలో అనువాదం చేసిన ఆచార్యులు కామరాజు అనిల్‌కుమార్‌(81) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఛాతినొప్పితో బాధపడుతూ ఏప్రిల్‌ 1న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. సత్యసాయితో ఆయనకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. గుంటూరుకు చెందిన అనిల్‌కుమార్‌ అక్కడ ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీలో ఆచార్యులుగా పనిచేస్తున్న క్రమంలో పుట్టపర్తి వచ్చారు. సత్యసాయి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి ఇక్కడికి వచ్చేశారు. 1985 నుంచి 2011 వరకు సత్యసాయిబాబా ప్రసంగాలకు ఆంగ్లానువాదాలు చేశారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, ముగ్గురు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పుట్టపర్తిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని