హవ్వ.. పింఛన్ల పంపిణీ అద్భుతమట!

రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ బుధవారం గందరగోళంగా మారింది. పంపిణీలో అనేక చోట్ల సమస్యలు కనిపించాయి. చాలా సచివాలయాల్లో పింఛనుదారులకు సరైన సౌకర్యాలు కల్పించలేదు.

Published : 04 Apr 2024 05:28 IST

లోపాలను ప్రస్తావించని అధికారులు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ బుధవారం గందరగోళంగా మారింది. పంపిణీలో అనేక చోట్ల సమస్యలు కనిపించాయి. చాలా సచివాలయాల్లో పింఛనుదారులకు సరైన సౌకర్యాలు కల్పించలేదు. కొన్నిచోట్ల సచివాలయాలనే తెరవలేదు. ఇన్ని లోపాలున్నా.. ఆ శాఖను పర్యవేక్షిస్తున్న శశిభూషణ్‌కుమార్‌ పరిస్థితిని చక్కబెట్టేందుకు తీసుకుంటున్న చర్యల్ని ప్రస్తావించనే లేదు. అంతా అద్భుతంగా జరిగినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై వైకాపా నేతలు తప్పుడు ప్రచారానికి తెగబడుతున్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను సదరు ప్రకటనలో పేర్కొనలేదు. వృద్ధులను ఉద్దేశపూర్వకంగానే సచివాలయాలకు తోడ్కొని వస్తున్న వైకాపా నేతల పట్ల మిన్నకున్నారు. ఈ వైఖరి అధికార పార్టీకి వంతపాడటం కిందకే వస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని