ఏపీ టిడ్కో జీఎంగా మాధురి

ఏపీ టిడ్కోలో జనరల్‌ మేనేజర్‌(భూములు)గా సీఎం ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డి వద్ద ఓఎస్‌డీగా పనిచేస్తున్న జి.మాధురిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Published : 04 Apr 2024 05:28 IST

ఇప్పుడెందుకీ పోస్టింగ్‌?

ఈనాడు, అమరావతి: ఏపీ టిడ్కోలో జనరల్‌ మేనేజర్‌(భూములు)గా సీఎం ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డి వద్ద ఓఎస్‌డీగా పనిచేస్తున్న జి.మాధురిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర ఆడిట్‌ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ హోదాలో ఉన్న ఆమెను.. జీఎంగా అదనపు బాధ్యతలపై నియమిస్తున్నట్లు పురపరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఫిబ్రవరి 29న జీవో విడుదల చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి టిడ్కోలో కార్యకలాపాలే లేవు. తెదేపా హయాంలో నిర్మించిన గృహాలను కూడా మూలన పెట్టేశారు. ఇప్పుడు అక్కడ పని ఒత్తిడి లేదు. కొత్త ఇళ్ల నిర్మాణాలకు అనుమతులూ లేని ఈ సమయంలో అంత అత్యవసరంగా మాధురిని టిడ్కో జీఎంగా నియమించాల్సిన అవసరమేమిటనే చర్చ ప్రభుత్వవర్గాల్లో నడుస్తోంది. పట్టణ గృహనిర్మాణం, ఇతర అంశాలను తెలుసుకునేందుకు తనకు ఏపీ టిడ్కోలో జీఎంగా పనిచేసే అవకాశం కల్పించాలని మాధురి ఫిబ్రవరి 26న కోరగా.. అదే రోజు సంస్థ ఎండీ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చింది. తర్వాత మూడు రోజులకే ఆమెను నియమించడం గమనార్హం. సీఎం ముఖ్యకార్యదర్శి వద్ద ఓఎస్‌డీగా పనిచేస్తున్న ఆమెను.. ఇప్పుడు ఏపీ టిడ్కోలో అదనపు బాధ్యతలపై నియమించడం చర్చనీయాశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని