విద్యా దీవెన అందక అవస్థలు పడుతున్నాం!

‘మాది కావలి. ఇక్కడ మా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారు. అయినా చెబుతున్నా. పేదవాళ్లమైనా ప్రభుత్వం ఆదుకుంటుందని ఉన్నత విద్య అభ్యసించాను.

Published : 04 Apr 2024 05:28 IST

విజయసాయిరెడ్డిని నిలదీసిన ఫార్మా విద్యార్థులు

ఈనాడు, నెల్లూరు: ‘మాది కావలి. ఇక్కడ మా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారు. అయినా చెబుతున్నా. పేదవాళ్లమైనా ప్రభుత్వం ఆదుకుంటుందని ఉన్నత విద్య అభ్యసించాను. ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యాదీవెన ఇవ్వలేదు. కళాశాల యాజమాన్యం ఆ డబ్బు కడితేనే విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని చెబుతోంది. చదువు పూర్తయినా ధ్రువీకరణ పత్రాలు లేక అవస్థలు పడుతున్నాం. ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి’ అని ఓ ఫార్మా విద్యార్థి బుధవారం ఎంపీ, నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డిని నిలదీశారు. నెల్లూరు రామ్మూర్తినగర్‌లోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో విజయసాయిరెడ్డి ఫార్మసిస్టులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడిన తర్వాత.. అక్కడికి వచ్చిన వారికి మాట్లాడే అవకాశం కల్పించారు. వారు పలు అంశాలపై ప్రశ్నించారు. నెల్లూరుకు చెందిన ఓ యువతి మాట్లాడుతూ.. ఇంజినీరింగ్‌ చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినంత సులువుగా ఫార్మా వారికి దొరకడం లేదన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కోరగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరులో జాబ్‌ మేళాలు నిర్వహిస్తామని చెప్పడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని